మా స్కూల్లో సంక్రాంతి - Prajasakti (original) (raw)

హాయ్ ఫ్రెండ్స్‌,
ఈ సంక్రాంతి పండగని మా స్కూల్లో బాగా జరుపుకున్నాం. మాది కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల. రంగవల్లులు, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శనలు మేమంతా చాలా ఇష్టంగా చేస్తాం. గంగిరెద్దుల మేళాలు, హరిదాసుల వేషాలు, పిట్టలదొర వేషాలను కూడా మేమే ధరిస్తాం. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగళగిరి సుహాసిని గారు పొంగళ్లు, పిండివంటలు వంటివి చేయించి అందరికీ పంచుతారు. మన సంస్క ృతిలో పండగల ఔచిత్యాన్ని తెలియజేస్తారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందిస్తారు. దామెర్ల నరసింహారావు మాస్టారుతో కలసి మా టీచర్లంతా వీటిని నిర్వహిస్తుంటారు.

– ఎన్‌.హేమ, కె.మణిమౌనిక, వి.లలితా భవాని,
9వ తరగతి, కొండపల్లి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల,
ఇబ్రహీంపట్నం మండలం, ఎన్‌టిఆర్‌ జిల్లా.