Ramyabehara: గాయకుడిని పెళ్లాడిన సింగర్‌ రమ్య బెహరా (original) (raw)

గాయనీగాయకులు రమ్య బెహరా, అనురాగ్‌ కులకర్ణి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు

Updated : 16 Nov 2024 10:47 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనీగాయకులుగా రమ్య బెహరా, అనురాగ్‌ కులకర్ణి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల పెద్దలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు గాయనీగాయకులు, సంగీత దర్శకులు సందడి చేశారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కామారెడ్డికి చెందిన అనురాగ్‌ కులకర్ణి సూపర్‌ సింగర్‌ అనే కార్యక్రమంతో సింగర్‌గా తెలుగువారికి పరిచమయ్యారు. ఆ కార్యక్రమంలో విజేతగా నిలిచి.. సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘శతమానం భవతి’లో ‘మెల్లగా తెల్లారిందో’, ‘కాటమరాయుడు’లో ‘మీరా మీరా మీసం’, ‘పైసా వసూల్‌’లో టైటిల్‌ సాంగ్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ‘ఉండిపో ఉండిపో’ వంటి ఎన్నో పాటలు ఆలపించారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ‘పిల్లా రా’, ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ‘ఆశాపాశం’ పాటలు గుర్తింపు తెచ్చిపెట్టాయి. నరసరావుపేటకు చెందిన రమ్య బెహర పలు సంగీత కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆమెను సినిమాల్లోకి తీసుకువచ్చారు. ‘బాహుబలి ది బిగినింగ్‌’లోని ‘ధీవరా’ పాట ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.